కృష్ణా జిల్లా నందిగామ పట్టణ డీవీఆర్ కాలనీలో వరద ముంపునకు గురైన ప్రాంతాలను.. తెలుగుదేశం పార్టీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. డీవీఆర్ కాలనీలో వరద వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారనీ.. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సహాయకచర్యలు ముమ్మరం చేయాలని కోరారు.
నందిగామ మండలం కమ్మవారిపాలెం, చందర్లపాడు మండలం తోటరావులపాడు, చింతలపాడు గ్రామాల్లో నీటమునిగిన పంటలను పరిశీలించారు. వరద ముంచెత్తిన కారణంగా.. పంటలు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: