ETV Bharat / state

జస్టిస్​ ప్రసన్నలత చొరవతో ఒక్కటైన పది జంటలు - కృష్ణా జిల్లాలో కలిసిన జంటలు

కుటుంబ కలహాల నేపథ్యంలో విడిపోయిన దంపతులు ఒక్కటి కావడానికి కృష్ణా జిల్లా తిరువూరు జేఎఫ్​సీఎమ్​ కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ వేదికయ్యింది. న్యాయమూర్తి జస్టిస్​ ప్రసన్నలత చొరవతో దంపతుల మధ్య నెలకొన్న వివాదం పరిష్కరం కావటంతో ఒక్కటయ్యారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/14-December-2019/5376255_1033_5376255_1576347359992.png
ten couples are meet in krishna district
author img

By

Published : Jan 1, 2020, 10:27 AM IST

జస్టిస్​ ప్రసన్నలత చొరవతో ఒక్కటైన పది జంటలు

కుటుంబ కలహాల నేపథ్యంలో విడిపోయిన దంపతులు జస్టిస్​ ప్రసన్నలత చొరవతో దంపతుల ఒక్కటయ్యారు. ఆ దంపతులు కలుసుకోటానికి కృష్ణా జిల్లా తిరువూరు జేఎఫ్​సీఎమ్​ కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ వేదికయ్యింది. తిరువూరు, ఏ కొండూరు, విసన్నపేట, చాట్రాయి, గంపలగూడెం పోలీస్​ స్టేషన్లో.... బాధితుల ఫిర్యాదు మేరకు గతంలో వరకట్న వేధింపులు, గృహహింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరు మహిళలు తమ భర్తల నుంచి మనోవర్తి ఇప్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోక్ అదాలత్ సందర్భంగా జస్టిస్​ ప్రసన్నలత.... భార్య భర్తలకు ఇచ్చిన కౌన్సిలింగ్ ఫలించింది. తాము తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని సుముఖత వ్యక్తం చేశారు. న్యాయవాదులు, పోలీసుల సమక్షంలో న్యాయమూర్తి ఇచ్చిన పూల మాలలను పరస్పరం మార్చుకున్న పది మంది దంపతులు ఒక్కటయ్యారు. న్యాయస్థానం చరిత్రలో సరికొత్త అధ్యాయానికి ఈ సందర్భం శ్రీకారంగా మారింది.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా జంట... భారతీయ సంప్రదాయంలో ఒక్కటైంది..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.