కృష్ణా నదిలో త్రాగు నీటి కోసం దిగిన పశువులు ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలయ్యాయి. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. నదిలో ఉన్న విద్యుత్ మోటార్ వైర్లు నీటికి తగిలి కరెంట్ ప్రసరించగా.. విద్యుదాఘాతానికి గురైన గేదెలు మృతి చెందాయి. సుమారు ఏడు లక్షల రూపాయలు విలువ చేసే గేదెలు చనిపోయాయని పశువుల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: