TDP Chief Chandrababu Naidu joint Krishna district paryatana updates: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లా మూడు రోజుల పర్యటనను బుధవారం ప్రారంభించారు. తొలి రోజు పర్యటనలో భాగంగా ఆయనకు అడుగడుగునా ప్రజలు, యువత, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల మీదుగా పర్యటిస్తూ.. రోడ్ షో చేపట్టి బహిరంగ సభలో సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు.
వారిని వదిలిపెట్టను.. వడ్డీతో సహా ఇచ్చేస్తా..?.. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..''జగన్.. మీబిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ. క్యాన్సర్‌లా మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాడు. సమాజాన్ని నాశనం చేసే వైసీపీ జెండాను మోయద్దు. వైసీపీ జెండాను కృష్ణా నదిలో ముంచేసి టీడీపీ జెండాను పట్టుకోండి. జగన్ పాలనలో ఆడబిడ్డల జీవితాలు చితికిపోయాయి. పింఛను అడిగిన ముస్లిం మహిళను హింసించి మళ్లీ ఎదురు కేసులా?. వైసీపీ వేధింపులు తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయింది. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఏ రౌడీనీ వదిలిపెట్టను. వాలంటీర్లకు ఇచ్చేది ప్రజాధనం కాదా?. చెడ్డ పనులు చేస్తే చిత్తుచిత్తుగా ఓడిస్తారు ప్రజలు. ఈ రాష్ట్రానికి క్యాన్సర్ లాంటి వ్యక్తి.. జగన్. క్యాన్సర్ గడ్డను తొలగించుకోకుంటే శరీరమంతా వ్యాపిస్తుంది. జగన్ లాంటి వ్యక్తిని పక్కన పెట్టకుంటే ప్రజలకే ప్రమాదం. ఇచ్చేది పది రూపాయలు.. గుంజేది వంద రూపాయలు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రానికి భవిష్యత్తు. తెలుగువారిని చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. సమాజాన్ని నాశనం చేసే పార్టీ జెండాను వైసీపీ నేతలు ఎలా మోస్తారు?. బాబాయిని రోజుకో రకంగా చంపేస్తున్నారు. గుండెపోటు, రక్తపోటు.. ఇప్పుడు ఇంకొకటి చెబుతున్నారు. ప్రజాజీవితం అంటే తమాషా అనుకోవద్దు.. తోకలు కట్ చేస్తా. రౌతు కొద్దీ గుర్రంలా పోలీసుల వైఖరి ఉంది. ప్రశ్నిస్తే చాలు.. మహిళలపైనా దాడులు చేస్తున్నారు. నాపైనా కేసులు పెడుతూనే ఉన్నారు.. భయపడేదే లేదు. నేనెప్పుడూ సభ్యతగానే మాట్లాడతా.. పద్ధతి తప్పను. దాడులు చేసేవారిని వదిలిపెట్టం.. వడ్డీతో సహా ఇస్తాం'' అని అన్నారు.
టీడీపీలో చేరినా 1000మంది వైసీపీ శ్రేణులు.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు సమక్షంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. కృష్ణలంక రాణిగారితోటలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోగుల రమేష్ యాదవ్, 17మంది నేతలతోపాటు మరో వెయ్యి మందికిపైగా అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
చంద్రబాబు రాక కోసం ప్రజల ఎదురుచూపులు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ర్యాలీలో భాగంగా ఆ పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు గ్రామ గ్రామాన అన్ని ఏర్పాట్లు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు, తాడిగడప, పెనమలూరు, పోరంకి, ఈడుపుగల్లు, కంకిపాడు, ఉయ్యూరు తదితర గ్రామాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బైక్ ర్యాలీ నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటించి జన సమీకరణ చేశారు. అనంతరం చంద్రబాబు కోసం ఆయా గ్రామ కూడళ్లలో జాతీయ రహదారిపై వేచి ఉన్నారు.
ప్రజాజీవితం అంటే తమాషా అనుకోవద్దు.. తోకలు కట్ చేస్తా. రౌతు కొద్దీ గుర్రంలా పోలీసుల వైఖరి ఉంది. ప్రశ్నిస్తే చాలు.. మహిళలపైనా దాడులు చేస్తున్నారు. నాపైనా కేసులు పెడుతూనే ఉన్నారు. భయపడను. వడ్డీతో సహా ఇచ్చేస్తా.-చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
ఇవీ చదవండి