Chandrababu naidu fire on YSRCP : లగ్నం పెట్టుకుందాం.. తాడోపేడో తేల్చుకుందాం.. ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా సైకోని కూడా తీసుకురండి.. అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఎస్సార్సీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ దెబ్బలు, దొంగాటలు వద్దని హితవు పలికారు. వైఎస్సార్సీపీ మూకల దాడిలో ధ్వంసమైన గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాలిపోయిన, ధ్వంసమైన కార్లను చూసి దాడి జరిగిన తీరును చంద్రబాబు ప్రత్యక్షసాక్షులను అడిగి తెలుసుకున్నారు.
వారు అసలు పోలీసులేనా.. పిచ్చి రౌడీ చేష్టలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం పాకిస్థాన్లో ఉందా..? తనను పర్యటించొద్దు అనడానికి పోలీసులెవ్వరని నిలదీశారు. చేసిన సిగ్గుమాలిన పనిపై పోలీసులు కుటుంబసభ్యుల వద్ద అయినా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రజా ఉద్యమ రూపకల్పనకు ప్రజలే శ్రీకారం చుట్టాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చేసే ఉద్యమంలో అంతా ఐక్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గన్నవరం పార్టీ ఇంచార్జి అర్జునుడు చావుబతుకుల మధ్య ఉంటే.. ఈ తరహా దాడి చర్యలను ఏ విధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.
జగన్ ను నమ్ముకుంటే జైలుకే... ఉగ్రవాదుల కంటే ఘోరంగా వైఎస్సార్సీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని, బరితెగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. ఎందరో మహానుభావులు పుట్టిన జిల్లాలో సైకోలు స్వైరవిహారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఎందరో అధికారులు జైలుకు పోయారని, తప్పుచేసి పోలీసులు అదే బాట పట్టొద్దని చంద్రబాబు హితవు పలికారు.
వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత.. చంద్రబాబు గన్నవరం పర్యటన దృష్ట్యా భారీగా పోలీసులను మోహరించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దొంతు చిన్నా ఇంటి నుంచి పార్టీ కార్యాలయం వరకు చంద్రబాబు నడిచి వచ్చారు. రిమాండ్లో ఉన్న బీసీ నేత దొంతు చిన్నా కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ధైర్యం చెప్పారు.
ఇవీ చదవండి :