కృష్ణా జిల్లాలో అవనిగడ్డ సీఐ ఆధ్వర్యంలో మోపిదేవిలో అమ్ముతున్న తెలంగాణ మద్యం బాటిళ్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అమ్ముతున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న 176 బాటిళ్లు సీజ్ చేశారు.
అక్రమ మద్యం అసలు రేటుకన్నా రెట్టింపు రేట్లకు మోపిదేవిలోని పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారని తెలిపారు. సుమారుగా రూ.50వేల మద్యం, 2 బైక్లు సీజ్ చేసి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇటువంటి సమాచారం ఉంటే నేరుగా అవనిగడ్డ సీఐ నెంబర్ 9440796467కి కాల్ చేయాలని.. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అవనిగడ్డ సీఐ బి.బీమేశ్వర రవికుమార్ తెలిపారు.
ఇదీ చదవండి భారీ వర్షం.. నీట మునిగిన వరినాట్లు