తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం రవాణా కొనసాగుతుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రం మల్లారం నుంచి కారులో తరలిస్తున్న 1236 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై మురళీకృష్ణ తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి చిల్లకల్లు పోలీస్ స్టేషన్ తరలించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి