Teachers Agitation in Vijayawada: పీఆర్సీ జోవోలకు వ్యతిరేకంగా... నిరసన తెలియజేసే హక్కును ప్రభుత్వం హరిస్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఏపీటీఎఫ్ పాఠశాలలో ఉపాధ్యాయులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నేతలు అనుమతి తీసుకోవాలని.. పోలీసులు చెప్పటంపై వారు మండిపడ్డారు.
ఉపాధ్యాయ సంఘాలను సీఎం స్వయంగా పిలిచి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు సహా ఫిట్‌మెంట్ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. 12వ తేదీ తర్వాత ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
CM Jagan slams Opposition Parties: 'ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రతిపక్షాలకు పండుగే'