కృష్ణా జిల్లా నందిగామ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత విధానాన్నే కొనసాగించాలని... పనిదినాలు 5రోజులే మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు. మూడు విడతల డీఏని వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందికి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీ చూడండి: సీడీపీవో పనితీరుపై అంగన్వాడీల ఆందోళన..!