కృష్ణా జిల్లా నూజివీడులో వైకాపా, తెదేపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కొన్ని రోజులుగా సామాజికి మాధ్యమాల వేదికగా ఇరు పార్టీల కార్యకర్తలు వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టింగ్‌లపై వాదనలు ఘర్షణకు దారి తీశాయి. వైకాపా కార్యకర్తల దాడిలో ఇద్దరు తెదేపా నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. అధికార పార్టీ నాయకుల గుండాగిరి అరికట్టాలని నూజివీడు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిoచి ఆందోళన చేపట్టారు.
పోలీసు స్టేషన్ ఎదుట తెదేపా శ్రేణుల ఆందోళన...
దాడిని ఖండిస్తూ తెదేపా శ్రేణులు నూజివీడు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టాయి. వైకాపా నాయకులపై ఫిర్యాదు చేసిన కార్యకర్తలను అరెస్టు చేశారని నిరసన తెలిపాయి. వైకాపా దాడి చేసినా తెదేపా కార్యకర్తలను అరెస్ట్ చేశారని.. వైకాపా కార్యకర్తలను పట్టుకుని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇదీ చదవండి:Third wave : నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదా..!