ETV Bharat / state

'ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పక్కా వైకాపా ఏజెంట్' - venktramireddy latest news

ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పక్కా వైకాపా ఏజెంట్​ అని తెదేపా అధికార ప్రతినిధి ఎన్​.బి. సుధాకర్​ విమర్శించారు. దీనికి సంబంధింది తమవద్ద అనేక ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గతంలో వైకాపా తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని.. సీఎం జగన్ ఆశీస్సులతతో అతి చిన్న వయసులోనే ​ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష పదవి చేపట్టారని అన్నారు.

tdp spokesperson sudhakar reddy
తెదేపా అధికార ప్రతినిధి ఎన్​.బి. సుధాకర్
author img

By

Published : Jan 25, 2021, 2:55 PM IST

ఉద్యోగ సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి వైకాపా ఏజెంట్ అనేందుకు తమవద్ద అనేక ఆధారాలున్నాయని తెదేపా అధికార ప్రతినిధి ఎన్.బి.సుధాకర్ అన్నారు. వెంకట్రామిరెడ్డి భార్య 2012లో ముషీరాబాద్ నియోజకవర్గంలో వైకాపా తరఫున పనిచేస్తే.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డికి జగన్ వైకాపా టిక్కెట్ ఇచ్చారన్నారు. నామినేషన్ సమయానికి ప్రభుత్వ ఉద్యోగి అనే విషయం బయటపడటంతో నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుపడలేదని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి.. తెదేపా అధికారంలోకి రాగానే వాటిని తొలగించారని విమర్శించారు. జగన్ ఆశీస్సులతోనే 49ఏళ్ల వయసులోనే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష పదవి చేపట్టారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: 'ఎన్నికలు ప్రజల కోసమా.. ఎస్​ఈసీ కోసమా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.