ETV Bharat / state

PATTABHI: 'ప్రతిష్టాత్మక ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై బురద చల్లుతున్నారు' - ap latest political news

వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. తెదేపా హయాంలో తీసుకొచ్చిన వినూత్న ప్రాజెక్ట్... అడ్వాన్స్‌డ్ ఫైబర్‌ టెక్నాలజీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

tdp-spokesperson-kommareddy-pattabhiram-fires-on-ycp-govt
'ప్రతిష్టాత్మక ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై బురద చల్లుతున్నారు'
author img

By

Published : Sep 14, 2021, 12:17 PM IST

ప్రతిష్టాత్మక ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై ఏదోరకంగా అవినీతి సృష్టించి బురుదజల్లే కార్యక్రమానికి జగన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి తన ఆధ్వర్యంలో ఉన్న సీఐడీని విశ్వసనీయత లేని విభాగంగా తయారు చేసి తాడేపల్లి ప్యాలెస్ ఆడమన్నట్లు ఆడేలా చేశారని దుయ్యబట్టారు. ఒకే కనెక్షన్​తో 3రకాల ట్రిపుల్ ప్లే సేవలు ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సౌకర్యం రూ.149కే అందించిన వినూత్న ప్రాజెక్టు ఫైబర్ నెట్ అని గుర్తు చేశారు.

'ప్రతిష్టాత్మక ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై బురద చల్లుతున్నారు'

తెదేపా పాలనలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బురదచల్లి, ఏ ఒక్కటీ రుజువు కాకపోవటంతో అసహనంతో ఉన్న జగన్ రెడ్డి ఫైబర్ నెట్ పై పడ్డారని మండిపడ్డారు. దేశమంతా ఈ విధానం అవలంభించాలని ప్రధాని అభినందించిన ఫైబర్ నెట్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 121కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తున్న గౌతం రెడ్డి 121పైసల అవినీతి కూడా నిరూపించలేరని సవాల్ చేశారు. టెరాసాఫ్ట్ సంస్థకు అనుకూలంగా తెదేపా ప్రభుత్వం టెండర్ తేదీని పొడిగించిందని చేసిన ఆరోపణలపై పట్టాభి వివరణ ఇచ్చారు.

ఇదీ చూడండి: Permanent transfer: ఏపీకి శాశ్వత బదిలీ... తెలంగాణ సర్కారు అనుమతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.