తిరుపతి ఉప ఎన్నికలో బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్... ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వైకాపా నేతలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్టిని మళ్లించేందుకే హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యవహార శైలిని తప్పుబట్టారు.
ఇదీ చదవండి:
ఎస్వీబీసీ ఛానల్‌కు డీఎస్ఎన్జీ వాహనం అందజేసిన కర్ణాటక మంత్రి