రాజధాని పై జగన్ వైఖరి స్పష్టం చేయాలని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. రాజధానిపై మంత్రి బొత్సాతో పదేపదే ఎందుకు మాట్లాడిస్తున్నారో తెలియాలని ఆయన అన్నారు. 100రోజుల పాలనలో వైకాపా వైఫల్యం చెందిందని చెప్పడానికి, తాజాగా పంపిణీ చేసిన నాణ్యమైన బియ్యమే రుజువని అన్నారు. ముందు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న వైకాపా నేతలు, తరువాత నాణ్యమైన బియ్యం ఇస్తామంటూ.. మాట మార్చారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా 8 మండలాల్లో ‘పనికిరాని, తినలేని బియ్యంను సరఫరా చేయడం దారుణమని అన్నారు. పరిశ్రమలు ఎక్కడికీ పోలేదని బొత్స అనడం హాస్యాస్పదమన్నారు. వోక్స్ వ్యాగన్ ఏమయ్యిందని ప్రశ్నించారు. ఎక్కడికి పోయిందో ఎందుకు పోయిందో బొత్స సమాధానం చెప్పాలన్నారు. విశాఖకు వచ్చే 1400కోట్ల రూపాయల పెట్టుబడులు, 3వేల ఉద్యోగాలు పోగొట్టింది బొత్స కాదా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి