ETV Bharat / state

పట్టించుకోని ప్రభుత్వం.. రోడ్డు నిర్మాణానికి తెదేపా శ్రీకారం

TDP Road constructing: కృష్ణాజిల్లా వెంట్రప్రగడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, చందాలు వేసుకుని రహదారి నిర్మించారు. వైకాపా ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో పామర్రు తెదేపా ఇంచార్జ్‌ వర్ల కుమార్‌ రాజా అధికారులు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు.

తెదేపా రోడ్డు నిర్మాణం
tdp road constructing
author img

By

Published : Nov 1, 2022, 9:51 PM IST

TDP Road constructing: అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించకపోవడంతో కృష్ణాజిల్లా వెంట్రప్రగడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చందాలు వేసుకుని రహదారి నిర్మాణానికి పూనుకున్నారు. పెదపారుపూడి మండలం శివాపురం గ్రామంలో ప్రజలు సరైన రోడ్డులేక అవస్థలు పడుతున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని పామర్రు తెదేపా ఇంచార్జ్‌ వర్ల కుమార్‌ రాజా అన్నారు. అధికారులు రోడ్డు వేయకుండా కాలయాపన చేస్తున్నారే తప్ప.. సమస్యలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. తెదేపా మండల నాయకులందరూ సుమారు రూ.50వేలతో.. తాత్కాలికంగా 150 మీటర్ల గ్రావెల్ రోడ్డు వేయడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నా,.. లేకపోయినా ప్రజల పక్షాన నిలబడుతుందని వర్ల కుమార్‌ రాజా అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.