రేషన్ డిపోల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న పంచదార, కందిపప్పు ధరలను పెంచడాన్ని నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడలోని 60వ డివిజన్ తెదేపా మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వాంబే కాలనీలోని 126 నెంబర్ రేషన్ డిపో ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ఉన్న ప్రస్తుత తరుణంలో పేదలకు ఉచిత సరకులు అందించాల్సిన ప్రభుత్వం.. ఉన్న ధరలు సైతం పెంచటం దారుణమని మండిపడ్డారు. తక్షణమే ధరలను తగ్గించి.. అన్ని రకాల సరుకులు డిపోల ద్వారా అందించాలని తెలుగు మహిళా నాయకులు కంచి పద్మ తదితరులు డిమాండ్ చేశారు.
కోనసీమలో తెదేపా నిరసనలు..
వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందని తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు అమలాపురంతో సహా కోనసీమలోని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. అమలాపురం, పి.గన్నవరం, అయినవిల్లి, అంబాజీపేట, మామిడికుదురు, సఖినేటిపల్లి తదితర మండల కేంద్రంలో తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు.
ఇవీ చూడండి...
విజయవాడ పోలీసుల దాతృత్వం.. చెయ్యి కోల్పోయిన వ్యక్తికి ఆర్ధిక సాయం