సకాలంలో సీబీఐ దర్యాప్తు పూర్తై ఉంటే.. వైద్యుడు సుధాకర్ ప్రాణం పోయేది కాదని తెదేపా నేత వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. రాక్షసత్వానికి, మూర్ఖత్వానికి నిలువుటద్ధంలా వ్యవహరించిన సీఎం జగన్.. ఏడాదిగా బెదిరింపులు, వేధింపులతో ఆయనను మానసికంగా హింసించారని ఆరోపించారు.
ఎస్సీలకు ప్రశ్నించే హక్కు లేదన్నట్లు వరుస ఘటనలు జరుగుతున్నాయన్నారు. సుధాకర్ లాంటి ఎస్సీలు ఇంకా ఎంతమంది ప్రభుత్వ అరాచకాలకు బలవ్వాలని నిలదీశారు.
ఇదీ చదవండి:
వైద్యుడు సుధాకర్ కుటుంబ సభ్యులను రేపు పరామర్శించనున్న లోకేశ్