ETV Bharat / state

జగన్ దిల్లీ పర్యటన అందుకేనా..? ఆసక్తి రేపుతున్న టీడీపీ నేతల ట్వీట్లు..

CM jagan delhi tour : ఓ వైపు వైఎస్ వివేకా హత్య కేసు.. ఇంకో వైపు లిక్కర్ కేసు.. వైఎస్సార్సీపీ ఎంపీలకు కునుకు పట్టనివ్వడం లేదు. రెండు కేసుల్లో అటు సీబీఐ, ఇటు ఈడీ దూకుడు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం పర్యటనపై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా టీడీపీ నేతలు.. ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.

జగన్ దిల్లీ పర్యటన పై విమర్శల పర్వం
జగన్ దిల్లీ పర్యటన పై విమర్శల పర్వం
author img

By

Published : Mar 17, 2023, 12:43 PM IST

Updated : Mar 17, 2023, 1:11 PM IST

CM jagan delhi tour : ఓ వైపు వైఎస్ వివేకా హత్య కేసు.. ఇంకో వైపు లిక్కర్ కేసు.. రెండు కేసుల్లో అటు సీబీఐ, ఇటు ఈడీ దూకుడు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యాన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం పర్యటనపై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా టీడీపీ నేతలు.. ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.

మద్యం కేసులో మాగుంట.. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఒంగోలుఎం పీ శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఆయన్ను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టు కాగా, ఈడీ నోటీసులు చర్చనీయాంశమయ్యాయి.

వివేకా హత్యోదంతంలో అవినాష్ రెడ్డి... మరోవైపు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్​ అవినాష్​ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండాఆదేశించాలని దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని, హత్య కేసులో దర్యాప్తు కొనసాగివచ్చని సీబీఐకి అనుమతి ఇస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

టీడీపీ నేతల అనుమానాలు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు పలు అనుమానాలు లేవనెత్తారు. పదే పదే ఎందుకు దిల్లీ వెళ్తున్నట్టు..? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ ప్రశ్నించారు. 'అయిన‌నూ పోయి రావ‌లె హ‌స్తిన‌కు అని జ‌గ‌న్ రెడ్డి... మళ్లీ మళ్లీ దిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు' అని నారాలోకేశ్‌ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఒక క‌న్నుని పొడిచిన మ‌రో క‌న్నుని కాపాడ‌టానికా, లేక సీబీఐ అధికారి బ‌దిలీ కోసమా, లేక లిక్కర్ స్కామ్ లో బుక్కయిన ఎంపీ కోసమా..? అంటూ లోకేశ్‌ ప్రశ్నాస్త్రాలు సంధించారు.

  • అయిన‌నూ పోయి రావ‌లె హ‌స్తిన‌కు అని జ‌గ‌న్ రెడ్డి మ‌రోసారి ఢిల్లీ ఎందుకెళ్తున్న‌ట్టు?

    A) ఒక క‌న్నుని పొడిచిన మ‌రో క‌న్నుని కాపాడ‌టానికి.

    B) సీబీఐ అధికారి బ‌దిలీ కోసం.

    C) లిక్క‌ర్ స్కాంలో బుక్క‌యిన ఎంపీ కోసం. #AbbaiKilledBabai #JaganPaniAyipoyindhi pic.twitter.com/1cnW3OzkNK

    — Lokesh Nara (@naralokesh) March 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేసులకు భయపడ్డారా.. కేసులు, నోటీసులకు భయపడే జగన్ ఆకస్మిక దిల్లీ పర్యటన అంటూ టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ ట్వీట్ చేశారు. జగన్ ఆకస్మిక పర్యటన ఎందుకు అంటూ నాలుగు అంశాలను ఆయన ప్రస్తావించారు. బాబాయ్ కేసులో కంగారుపడ్డాడా..? ఎంపీ అరెస్టుపై కలవరపడ్డాడా..? కొత్త నోటీసులకు భయపడ్డాడా..? గూగుల్ టేకౌటుకు తత్తరపడ్డాడా..? అంటూ ధూళిపాళ నరేంద్ర చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది.

దిల్లీ చేరిన సీఎం జగన్... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సాయంత్రం దేశరాజధాని దిల్లీ బయల్దేరి వెళ్లారు. సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరిన ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రాత్రి 7.30 గంటలకు దిల్లీచేరుకున్నారు. ముఖ్యమంత్రి 1 జనపథ్ లోని నివాసంలో బస చేయనుండగా.. ఇవాళ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్టు సమాచారం. రాష్ట్రంలో సమస్యలు, వివిధ పథకాలకు అందాల్సిన నిధులపై చర్చించనున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి :

Last Updated : Mar 17, 2023, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.