ETV Bharat / state

ఉపాధిహామీ బకాయిలు చెల్లించాలని హైకోర్టులో పిల్​ - tdp mlc babu rajendraprasad on nregs funds

2018-19 సంవత్సరంలో పనిచేసిన కూలీలకు వెంటనే ఉపాధిహామీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో పిల్​ దాఖలైంది. దాదాపు రూ.2,500 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్​ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ప్రభుత్వం.. ఉపాధిహామీ బకాయిలు చెల్లించాలని హైకోర్టులో పిల్​

author img

By

Published : Apr 30, 2020, 8:29 PM IST

ఉపాధిహామీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ హైకోర్టులో తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పిల్ దాఖలు చేశారు. 2018, 2019 సంవత్సరాల్లో పనిచేసిన కూలీలకు ఇవ్వాల్సిన 2 వేల 500 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం విడుదల చేసిన 19 వందల కోట్ల రూపాయలను గతంలో పనిచేసిన వారికి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ధిక్కరించిందని ఆయన ఆరోపించారు. కొత్తగా పనులు చేసినవారికి బిల్లులు ఇస్తూ.... పాత బకాయిలను చెల్లించకపోవడం అన్యాయమన్నారు. బకాయిలు చెల్లించకపోతే పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

ఇదీ చూడండి..

'అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.