రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అక్రమంగా దక్కించుకున్న వైకాపా.. తాడిపత్రిపై కన్నేసిందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు.. ఆపరేషన్ తాడిపత్రి పేరుతో తెదేపా, కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను తమవైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతోందని ఆరోపించారు. తెదేపా అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నుంచి రక్షించుకోవడానికి తెదేపా అభ్యర్థులను జేసీ ప్రభాకర్ రెడ్డి సురక్షిత ప్రదేశానికి తరలించారన్నారు. తన ఎక్స్ అఫీషీయో ఓటుని కావాలనే అధికారులు తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పనిచేసిన అధికారులపై కోర్టుల ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...: రసవత్తరం.. తాడిపత్రి ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం