మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై తెదేపా నేతలు మండిపడుతున్నారు. బీసీ నేతలపై ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధిస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్.. జగన్మోహన్రెడ్డి నియంత పాలన, దౌర్జన్యకాండకు నిదర్శమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాక అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడానికి దాడులు, అణచివేతలు, వేధింపులు, ప్రతీకారంతో కాలం నెట్టుకొస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: 'బాబాయ్‌ని అరెస్టు చేసింది ఏసీబీనా?... గూండాలా?'