తన బినామీ కాంట్రాక్టర్లకు రెండు రోజుల్లో రూ.6400 కోట్లు చెల్లించిన ముఖ్యమంత్రి.. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయడు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలివ్వడానికి డబ్బుల్లేవని, రెండు విడతల్లో చెల్లిస్తానంటున్న సీఎం.. కాంట్రాక్టర్ల బిల్లులు ఎలా చెల్లించారని ట్విట్టర్ ద్వారా నిలదీశారు. ఉపాధి హామీ పనుల పాతబకాయిలు వేలకోట్లు పెండింగ్‌లో ఉంచిన సీఎం.. ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన 3 నెలల వేతన బకాయిలు రూ.455 కోట్లు చెల్లించలేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. వైకాపా కార్యకర్తల ఉపాధి కోసం మాత్రం ఆగమేఘాల మీద రూ.961 కోట్ల బిల్లులు చెల్లించటం ఏం న్యాయమని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
ఇదీ చదవండి: