ఇసుక కొరతపై విజయవాడ తేదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు లు భవన నిర్మాణ రంగ కార్మికులతో కలిసి నిరసనకు దిగారు. నిరసన ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఇసుక రీచ్ లకు అనుమతి ఇవ్వకపోతే, 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరతతో నిర్మాణ పనులు ఆగిపోయాయని గద్దె రామ్మోహన్ ధ్వజమెత్తారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తెదేపా అధికార ప్రతినిధి అనురాధ లు ఇసుక కొరతపై ఆందోళనకు దిగారు. భవన నిర్మాణ కార్మికులు గత మూడు నెలలుగా ఉపాధి కోల్పోయారని వైవీబీ అన్నారు. ప్రభుత్వ వైఫల్యం ఇంతకాలం పాటు విధానంపై ఎటువంటి చర్యలు తీసుకోవడంతో ఈ గతి పట్టిందని అనురాధ మండిపడ్డారు.
విజయవాడలో తెలుగుదేశం నాయకులు స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఇసుక కొరతపై ధర్నా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ దొండపాటి రాము ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, తెదేపా కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇసుక పంపిణీ విధానం పై ప్రభుత్వం తీసుకుంటున్న మొండి వైఖరి ఎన్నో కుటుంబాలను రోడ్డుపై నిలబెడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.