ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్ మరణించారని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, తెదేపా శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లచొక్కాలు ధరించిన కార్యకర్తలు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నల్లజెండాలతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వచ్చారు. .
ఇదీ చూడండి : 'కోడెల కుటుంబ సభ్యులకు వైకాపా నేతల సంతాపం'