ETV Bharat / state

'దందాయాత్ర అనబోయి.. పాదయాత్ర అంటున్నారు' - నక్కా ఆనంద్ బాబు తాజా సమాచారం

వైకాపా నాయకులపై తెదేపా నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి దందాయాత్ర అనబోయి పాదయాత్ర అంటున్నారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య ఎద్దేవా చేశారు. మాచర్లలో ఎన్నికలు శాంతియుతంగా జరిగాయని పిన్నెల్లి చెప్పటం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమాలు చేయకపోకతే తేదేపా నేతలపై ఎందుకు దాడి చేయించారని నిలదీశారు.

tdp leaders nakkaa anand babu and buchaiah choudhary criticize ycp leaders
'విజయసాయిరెడ్డి...దందాయాత్ర అనబోయి పాదయాత్ర అంటున్నారు'
author img

By

Published : Feb 17, 2021, 10:07 PM IST

విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తే... ఎక్కడ భూములు ఉన్నాయో అని వెతికే ప్రయత్నం చేస్తారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. దందాయాత్ర అనబోయి పాదయాత్ర అంటున్నారని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి దిల్లీ వెళ్లి అక్కడ పోరాడాలని బుచ్చయ్య చౌదిరి ట్విటర్​లో హితవు పలికారు.

ప్రజలు అధికారం ఇచ్చింది పాదయాత్రలు, విహార యాత్రలు చేయమని కాదు. రావాల్సినవి రాకపోతే కేంద్రంపై పోరాడాలని, ఆ పదవి పట్టుకుని వేలాడకుండా రాజీనామా చేసి రావాల్సినవి హక్కుగా తీసుకోవాలి. - గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా సీనియర్ నేత

రౌడీలతో ఎందుకు దాడి చేయించారు?: నక్కా

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... రౌడీయిజం, దౌర్జన్యాలు రాష్ట్రమంతా తెలుసని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. మాచర్లలో ఎన్నికలు శాంతియుతంగా జరిగాయని పిన్నెల్లి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తోడేలు శాఖాహారిగా మారిందంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఎన్నికల్లో అక్రమాలు చేయకపోతే తెదేపా నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, హైకోర్టు న్యాయవాది కిషోర్​లపై రౌడీలతో ఎందుకు దాడి చేయించారని నిలదీశారు.

ఇదీ చదవండి...

కొడాలి నాని పిటిషన్​పై తీర్పు రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.