ETV Bharat / state

టిడ్కో చీఫ్ ఇంజనీర్​కు వినతిపత్రం అందజేసిన తెదేపా నేతలు

తెదేపా హయంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు విజయవాడలో టిడ్కో చీఫ్ ఇంజనీర్​కు వినతిపత్రం అందజేశారు. పేదల సొంత ఇంటి కల సాకారం‌ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్లు నిర్మించారని.. తమకు సొంత ఇల్లు వస్తుందని ప్రజలు అప్పులు‌ చేసి డబ్బులు‌ చెల్లించారని వివరించారు.

టిడ్కో చీఫ్ ఇంజనీర్​కు వినతి పత్రం అందజేసిన తెదేపా నేతలు

author img

By

Published : Oct 28, 2020, 2:12 PM IST

తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ... ఆ పార్టీ నేతలు విజయవాడలోని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాణశాఖ - టిడ్కో - చీఫ్‌ ఇంజనీరుకు వినతిపత్రం అందజేశారు. ఇళ్ల మంజూరుపై టిడ్కో మేనేజింగ్‌ డైరెక్టరును కలిసి చర్చించాలని భావించినా... ఆయన అందుబాటులో లేకపోవడంతో చీఫ్‌ ఇంజనీరుతో సమావేశమై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.

పేదల సొంత ఇంటి కల సాకారం‌ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్లు నిర్మించారని... తమకు సొంత ఇల్లు వస్తుందని ప్రజలు అప్పులు‌ చేసి డబ్బులు‌ చెల్లించారని వారు తెలిపారు. రంగులు వేస్తే గృహప్రవేశం చేసే ఇళ్లను కూడా కేటాయించకుండా నిలిపేశారని వారు ఆరోపించారు. జనవరిలోగా ప్రభుత్వం ఆ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని, లేకుంటే.. ప్లాట్లు కేటాయించిన వారితో గృహాలను ఆక్రమింపజేస్తామని స్పష్టం చేశారు.

ఇళ్లు రాని ప్రజలకు... కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం మొక్కుబడిగా ఇళ్లు నిర్మించాలని, సెంటు స్థలంతో సరి పెట్టాలని చూస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వం స్పందించక పోతే శాంతిభద్రతల సమస్యను కూడా తాము లెక్కచేయకుండా పోరాడతామని హెచ్చరించారు. తెదేపా హయాంలో ఎనిమిది లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులుకు ప్లాట్లు నెంబర్లతో సహా కేటాయించామని, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి‌ 18 నెలలు అయినా ఎవరికీ ఇళ్లు ఇవ్వలేదని వారు మండిపడ్డారు

ఇదీచదవండి

ఆపద మిత్ర పథకంలో కృష్ణా జిల్లా ఎంపిక

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.