సంస్కారం గురించి ప్రధాని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న ఎద్దేవాచేశారు. మోదీ దృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు ఎమ్మెల్యే బొండా ఉమ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లుండి కూడా చూడలేని స్థితిలో మోదీ ఉన్నారని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాల నిధులు వెనక్కి తీసుకున్న నీచ సంస్కృతి తమదేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలపై ప్రధాని సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. వైకాపాతో లాలూచీ పడి మోదీ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
