వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మీటర్ల ఏర్పాటు ఎవరికి లాభమో స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వలేని ప్రభుత్వం విద్యుత్ చార్జీలను రైతుల ఖాతాలోకి నగదు బదిలీ చేస్తాననటం మోసమేనని అమర్నాథ్‌రెడ్డి ఆరోపించారు.
రైతుల ప్రమేయం లేకుండా.. వారి ఖాతా నుంచి నగదు నేరుగా విద్యుత్ సంస్థలకు మళ్ళించేందుకు ప్రభుత్వం పూనుకుందని తెదేపా నేత కిమిడి నాగార్జున విమర్శించారు. గ్యాస్ కనెక్షన్‌కు సబ్సిడీ ఇచ్చి మహిళలను మోసం చేసినట్లే.. ఇప్పుడు రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం స్మార్ట్ మీటర్లను ఆపకపోతే రైతులకు ఆర్థిక ఇబ్బందులు పెరిగే ఆస్కారం ఉందన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ విజృంభణతో స్తంభించిపోయిన పర్యటకం