కృష్ణా జిల్లా మచిలీపట్నం నగర పాలక సంస్థకు సంబంధించిన ఓటర్ల జాబితాలో నింబంధనలకు విరుద్ధంగా అదనంగా ఓటర్లను చేర్చారంటూ తెదేపా నాయకులు నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మార్చిలో నామపత్రాల దాఖలు సమయంలో ఇచ్చిన ఓటర్ల జాబితాకు.. ప్రస్తుతం ఇచ్చిన దానికి చాలా తేడాలున్నాయని మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ అన్నారు. ప్రతి వార్డులోనూ కొత్తగా ఓటర్లను చేర్చారని.. పరిశీలించి తగు చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఇదీ చదవండి: రసవత్తరంగా పురపాలిక పోరు