ETV Bharat / state

వైకాపా ప్రభుత్వంపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం..

వైకాపా ప్రభుత్వంపై... తెదేపా నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ తీరుపై తెదేపా నేతలు మండిపడుతున్నారు. వైకాపా అవినీతికి పాల్పడుతోందని వారు ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వంపై కొనసాగుతున్న తెదేపా నేతల విమర్శలు

author img

By

Published : Jul 30, 2021, 6:45 PM IST

మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కనుసన్నల్లో ఓబుళాపురానికి మించిన అక్రమ మైనింగ్... మైలవరంలో జరుగుతోందని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రౌడీ షీటర్లు, అత్యాచార నిందితులు, ఇసుక దందా రాయుళ్లను పక్కన పెట్టుకుని కృష్ణ ప్రసాద్ తమకు నీతులు చెప్తున్నారని ధ్వజమెత్తారు. 1988లో ఎస్సీ మహిళను వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు.

ల్యాంకో హిల్స్ నుంచి కొండపల్లి వరకూ వసంత కుటుంబం అవినీతికి పాల్పడిందని విమర్శించారు. మనీలాండరింగ్ కేసుల్లో కోర్టులు చుట్టూ తిరిగే వసంత కృష్ణ ప్రసాద్ సెంటు భూమి పథకంలో 400 ఎకరాలకు సంబంధించిన డబ్బును కొట్టేశారని ఆరోపించారు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను నరికి అక్రమ మైనింగ్ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు.

వైకాపా పై ధ్వజమెత్తిన మర్రెడి శ్రీనివాస్ రెడ్డి...

అనంతపురం జిల్లా రాయదుర్గంలో వ్యవసాయానికి ప్రభుత్వం విధిస్తున్న విద్యుత్ కోతలపై ప్రశ్నించిన రైతు సిద్ధార్థరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల తన పైరు ఎండిపోతోందని అధికారిని ప్రశ్నించిన రైతు సిద్దార్థరెడ్డిపై 153(ఏ) సెక్షన్ కింద కేసు పెట్టారు. వెంటనే ఆ తప్పుడు కేసు ఎత్తివేసి ప్రభుత్వం రైతుకు బహిరంగ క్షమాపణచెప్పాలి. 153 (ఏ) సెక్షన్ చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసినా, వైకాపా నేతల మెప్పు కోసం పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమగోడు, ఆవేదనను ప్రభుత్వానికి చెప్పుకునే వీలు కూడా రైతులకు లేదా. ప్రభుత్వ వింతలు, విపరీతాలు చూసి ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు. ప్రైవేటు సైన్యంతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.” అని మండిపడ్డారు.

ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది: గాలి భానుప్రకాశ్

చిత్తూరు జిల్లా పుత్తూరులో నగరి తెదేపా ఇన్​చార్జ్ గాలి భాను ప్రకాష్ వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్​ని దూరంచేసి ముఖ్యమంత్రి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు వంటి వాటిలోనూ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కొవిడ్ సమయంలో 600 మంది ఉపాధ్యాయులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

ప్రతీ స్కీమ్...ఒక స్కామ్: కూన రవి

వైకాపా సర్కారు ప్రవేశపెట్టిన ప్రతీ స్కీమ్‌.. ఒక స్కామ్‌ అని తెదేపా నేత కూన రవికుమార్‌ ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కూన రవికుమార్‌.. జగనన్న విద్యాదీవెన పథకంపై మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయంలో 16 లక్షల మంది విద్యార్దులకు ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్‌ చేయగా.. వైకాపా సర్కారు దానిని 10.97 లక్షల మంది విద్యార్దులకు కదించారన్న కూన రవి.. దీన్ని విద్యార్దులు గమనించాలని కోరారు. తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చడంతో పాటు కోతలు విధించి ఇస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:

నయా లుక్​లో మహేంద్రుడు.. ఫ్యాన్స్​ ఖుష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.