ETV Bharat / state

రాష్ట్రంలో జడ్జికే రక్షణ లేదు: యనమల

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతోనే మూసివేశారన్నారు. రాష్ట్రంలో జడ్జికే రక్షణ లేనప్పుడు ప్రజలకు ఏవిధంగా రక్షణ ఉంటుందని నిలదీశారు.

author img

By

Published : Jul 16, 2020, 4:03 PM IST

yanamala comments on govt
ప్రభుత్వంపై యనమల రామకృష్ణుడు ధ్వజం

అన్నా క్యాంటీన్లను మూయలేదని మానవ హక్కుల కమిషన్​కు రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం నయవంచనే అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రజలనే కాకుండా ఎన్​హెచ్చార్సీని సైతం వైకాపా ప్రభుత్వం దగా చేయటం గర్హనీయమన్నారు. దేన్నైనా కూల్చాలన్నా.. ధ్వంసం చేయాలన్నా రిమోట్ కంట్రోల్ సీఎం జగన్ చేతిలోనే ఉందని ఆరోపించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతోనే మూసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

జడ్జిపై దాడిని ఖండిస్తున్నాం

న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని ఖండిస్తున్నామన్నారు. వైకాపా పాలనలో దళితులకు భద్రత లేదనటానికి ఇది మరో సాక్ష్యమని చెప్పారు. జడ్జి రామకృష్ణపై దాడి వెనుక చిత్తూరు వైకాపా నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. అందువల్లే కేసు నమోదు చేయకుండా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో జడ్జికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడికి భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

కొత్త కార్పొరేషన్ ఎందుకు?

రాజకీయ నిరుద్యోగుల కోసమే శాండ్ కార్పోరేషన్ అనీ... దాని వల్ల ప్రజలకు, పేదలకు ఒరిగేది శూన్యమని అన్నారు. ఇప్పటికే మైనింగ్ కార్పొరేషన్ ఉండగా.. శాండ్ కార్పొరేషన్ ఎందుకని నిలదీశారు. కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టడంపై జగన్ సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. తక్షణమే నిర్మాణం పూర్తయిన లక్షలాది ఇళ్లను పేదలకు వెంటనే అందివ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'దళితులపై దాడులు..చెల్లించక తప్పదు భారీ మూల్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.