స్వప్రయోజనాల కోసమే సీఎం జగన్ దిల్లీలో పర్యటిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సీఎం జగన్ దిల్లీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. విధ్వంసానికే 3 రాజధానులు తప్ప.. అభివృద్ధి వికేంద్రీకరణకు కాదని దుయ్యబట్టారు. బెయిల్ రద్దవుతుందనే భయంతో పదేపదే దిల్లీ వెళ్తున్నారని యనమల అన్నారు.
కేంద్రానికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాలను మీడియాకు ఎందుకు విడుదల చేయట్లేదని నిలదీశారు. మీడియా ముందుకు వచ్చి ఎందుకు వాస్తవాలు చెప్పట్లేదని ప్రశ్నించారు. జగన్ అక్రమ సంపాదన ప్రభుత్వ ఖజనాకు జమచేయాలని యనమల డిమాండ్ చేశారు. రూ.43 వేల కోట్లు ప్రభుత్వ ఖజనాకు జమచేస్తే రెవెన్యూలోటు ఉండదని యనమల అన్నారు.
ఇదీ చదవండి: