ETV Bharat / state

వైసీపీ నేతలు సీబీసీఎన్సీ స్థలాన్ని దోచుకుంటున్నారు: వర్ల రామయ్య - news on TDP leader Varla Ramaiah

TDP leader Varla Ramaiah: దళితులకు మాయమాటలు చెప్పి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు వారిని మోసం చేస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. జగన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్కరి ఆస్తులకూ భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. జగన్ రెడ్డికి క్రైస్తవుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సిరిపురం సీబీసీఎన్సీ ఆస్తులపై కన్నేసిన వైసీపీ నేతలను తక్షణమే కట్టడి చేయాలన్నారు.

TDP leader Varla Ramaiah reacted
వర్ల రామయ్య
author img

By

Published : Dec 2, 2022, 8:40 PM IST

Varla Ramaiah reacted to CBCNC lands: సిరిపురంలోని సీబీసీఎన్సీ స్థలానికి వైసీపీ నేతలు ఎసరు పెట్టారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్కరి ఆస్తులకూ భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. ఎప్పుడు ఎవరు వచ్చి ఈ స్థలం తనది, తనకు ఇవ్వకపోతే చంపేస్తా అంటూ బెదిరిస్తారో తెలియని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. తాజాగా విశాఖపట్నం, సిరిపురంలోని సీబీసీఎన్సీ స్థలాన్ని అధికార పార్టీ పెద్దలు కొట్టేయబోతున్నట్లు సమాచారం తెలుస్తోందని వర్లరామయ్య పేర్కొన్నారు.

మాయమాటలు చెప్పి దళితుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు.., నేడు వారి ప్రార్థనా స్థలాలకు చెందిన స్థలాలనే వారి పార్టీ నేతలు కొట్టేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చుంటారా అంటూ మండిపడ్డారు. యథా రాజా....తథా ప్రజా అన్న చందంగా వైసీపీ నేతల తీరు కనబడుతోందని విమర్శించారు. సీఎం దగ్గర్నుండి కార్యకర్త వరకు భూకబ్జాలు, దోపిడీలు, బెదిరించి లాక్కోవడం వంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డికి క్రైస్తవుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సిరిపురం సీబీసీఎన్సీ ఆస్తులపై కన్నేసిన వైసీపీ నేతలను తక్షణమే కట్టడి చేయాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు ఒక కమిటీ వేసి వాటిని కాపాడాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.