ETV Bharat / state

'పింఛను పెంచకుండా మొండిచెయ్యి చూపించారు' - తంగిరాల సౌమ్య తాజా వార్తలు

ప్రభుత్వం ఈ నెల పింఛనుదారులకు రూ. 250 పెంచకుండానే అందించారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహించారు. సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.

tdp leader tangirala soumya given letter to veerulapadu mpdo officer
వీరులపాడు ఎంపీడీవో అధికారికి వినతిపత్రం అందజేసిన తంగిరాల సౌమ్య
author img

By

Published : Oct 1, 2020, 6:44 PM IST

రాష్ట్రంలో పింఛను తీసుకుంటున్నవారికి రూ. 250 పెంచకుండా ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి మొండి చెయ్యి చూపించారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. గడిచిన నెలల పింఛను బాకాయిని సత్వరమే లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్​ చేశారు. వీరులపాడు మండల ప్రజా పరిషత్ అధికారికి వినతిపత్రం అందజేశారు.

కొణతాల పల్లి, పెద్దాపురం గ్రామాల్లో అన్ని అర్హతలు కలిగి ఉండి చేయూత పథకానికి అర్జీలు దాఖలు చేసిన లబ్ధిదారులకు చేయూత అందజేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అందజేసి సుపరిపాలనను అందించాలి కానీ... పార్టీ కాని వారిని అర్హుల జాబితా నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే సౌమ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.