రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని వైకాపా ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చిందని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ విమర్శించారు. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు చూపితే అనుమతి లేదంటున్నారని.. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నెట్వర్క్ ఆసుపత్రులు కరోనా రోగుల్ని దోపిడీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం లేదనే బోర్డులు వెలిశాయని దుయ్యబట్టారు. జరుగుతున్న పరిణామాల పట్ల చోద్యం చూస్తున్న ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకుంటోందని సయ్యద్ రఫీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ.. మే 3కు వాయిదా