ETV Bharat / state

'కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం విఫలం' - tdp leader somi reddy news upadtes

మహమ్మారి కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేత సోమిరెడ్డి ఆరోపించారు. పరిపాలన చేతకాక ముఖ్యమంత్రి చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. స్వచ్ఛందంగా సాయం చేసేవారిని కాదని...బలవంతపు వసూళ్లు చేస్తూ తాము సాయం చేస్తామనటం దుర్మార్గమన్నారు.

tdp-leader-somi-reddy-fire-on-ysrcp
tdp-leader-somi-reddy-fire-on-ysrcp
author img

By

Published : Apr 24, 2020, 3:12 PM IST

కరోనా వైరస్‌ను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. పరిపాలన చేతకాక ముఖ్యమంత్రి చేతులెత్తేశారన్న ఆయన..ఎమ్మెల్యేలు రెచ్చిపోయి వైరస్​ను‌ మరింత వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రజాప్రతినిధులు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోగా ఉల్లంఘించి మరీ కరోనా విస్తరించేలా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఎందుకు ఏ ఒక్కరినీ మందలించలేకపోతున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు. స్వచ్ఛందంగా సాయం చేసేవారిని కాదని...బలవంతపు వసూళ్లు చేస్తూ తాము సాయం చేస్తామనటం దుర్మార్గమన్నారు. కేంద్రం రూపొందించిన చట్టాన్ని ఉల్లంఘించి వసూళ్లు చేస్తున్నారని...అలాంటి ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాడేపల్లికి మాత్రమే ముఖ్యమంత్రిగా జగన్ పరిమితమయ్యారన్న సోమిరెడ్డి...రైతుల వద్ద అన్ని ఉత్పత్తులు కొనుగోలు చేస్తామనే ప్రకటన మాటలకే పరిమితమైందన్నారు.

ఇవీ చదవండి: జులై 8న 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.