కేసుల మాఫీ కోసం సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టుపెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిశ్రమను వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన పార్లమెంట్ కమిటీలో ఎంపీ అవినాశ్ రెడ్డి సభ్యుడిగా ఉండి ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అని అడిగి సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. శాంతియుతమైన కుప్పంలో అరాచకాలు చేశారని లోకేశ్ ఆరోపించారు. ప్రజల్ని బెదిరించకుండా ఓట్లు అడగగలరా అని సవాల్ విసిరారు. ఏం చూసి ప్రజలు వైకాపాకు ఓటెయ్యాలని నిలదీశారు.
ఇదీ చదవండి: 10 అంశాలతో తెదేపా పురపాలక ఎన్నికల మేనిఫెస్టో