ETV Bharat / state

ఎస్పీకి వచ్చిన అనుమానమే నాకూ వచ్చింది: కొల్లు రవీంద్ర - kollu ravindra on perni nani attack

పేర్నినానిపై దాడి కేసులో పోలీసుల నోటీసులపై తెదేపా నేత కొల్లు రవీంద్ర స్పందించారు. ఎస్పీ మీడియా వద్ద వ్యక్తం చేసిన అనుమానాన్నే తానూ వ్యక్తం చేస్తూ మాట్లాడనని అన్నారు. పోలీసులు తన స్టేట్ మెంట్ తీసుకున్నారని తెలిపిన ఆయన... ఈ కేసులో న్యాయపరంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

kollu ravindra on perni nani attack case

author img

By

Published : Dec 3, 2020, 3:07 PM IST

మంత్రి పేర్నినానిపై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. జిల్లా ఎస్పీ మీడియా ముందు వ్యక్తం చేసిన అనుమానాన్నే తానూ మాట్లాడానని వివరణ ఇచ్చారు. పేర్నినానిపై దాడి అంశంలో తాను చేసిన వ్యాఖ్యలపై పోలీసులు 91 సీఆర్పీసీ ప్రకారం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చినట్టు పేర్కొన్నారు. పేర్ని నానిపై జరిగిన దాడికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కోరారని కొల్లు రవీంద్ర తెలిపారు. పోలీసులు తన స్టేట్​మెంట్ తీసుకున్నారని కొల్లు రవీంద్ర వెల్లడించారు.

నాగేశ్వరరావును తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా వైకాపా నేతలు ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను తెదేపాకు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఈ కేసులో పలువురు తెదేపా నేతలను విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. న్యాయపరంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు.

మంత్రి పేర్ని నానిపై దాడి కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. ఇసుక దొరక్క అక్కసుతోనే నిందితుడు దాడి చేసి ఉంటాడనే వ్యాఖ్యలపై ఆధారాలు చూపాలంటూ కొల్లు రవీంద్రకు నోటీసులు పంపారు.

ఇదీ చదవండి: మంత్రి పేర్నినానిపై దాడి కేసు: కొల్లురవీంద్రకు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.