ప్రపంచమంతా లాక్డౌన్ అంటుంటే జగన్ ఎన్నికలు అంటున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ దుయ్యబట్టారు. ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు మొట్టికాయలేసినా బుద్ది రాలేదా అని విమర్శించారు. రాష్ట్రంలో ద్విభాషా సూత్రాలను అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. 10 నెలల్లో హైకోర్టుతో 50కి పైగా మొట్టికాయలు వేయించుకున్న ఘనత దేశంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని జవహర్ ఎద్దేవా చేశారు. జగన్ ఏం ఆదేశించినా మంత్రులు కనీసం ఆలోచించకుండా ముందుకు వెళుతున్నారని మండిపడ్డారు. ఆంగ్లమాధ్యమంపై ఇంత హడావుడి చేసిన ప్రభుత్వం ఎంతమంది ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ బోధనలో శిక్షణ ఇప్పించిందని జవహర్ ప్రశ్నించారు. డిసెంబర్ నాటికి పుస్తకాలు పంపిణీ చేయలేనివారు నాడు-నేడు అంటూ హడావుడి చేస్తున్నారంటూ విమర్శించారు. అలాగే రమేశ్ కుమార్ రాసిన లేఖపై ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు సిగ్గుచేటన్నారు.
ఇవీ చదవండి