![devineni uma fires on ycp on land mafia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8057781_devi.jpg)
న్యాయస్థానాల నుంచి 65 మొట్టికాయలు, విపక్షనేతలపై రాజకీయకక్ష సాధింపుతో కేసులు, దాడుల విషయాలు తెలుసన్న రాష్ట్రపతిభవన్ మాటలు... తాడేపల్లి రాజప్రసాదంలోని జగన్‌కు వినబడుతున్నాయా? అని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. ఇసుక, మద్యం, భూసేకరణలో అవినీతి, అక్రమాలు... రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతల భూకబ్జాలు, మీడియాకు బెదిరింపులు వంటి విషయాలు రాష్ట్రపతి భవన్ వరకూ వెళ్లాయని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇదీ చదవండి:
'బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి'