సొంత పార్టీ ఎంపీ చనిపోతే..., ముఖ్యమంత్రి కనీసం ఆ కుటుంబాన్ని ఇంతవరకూ పరామర్శించకపోవటం ఎంతో శోచనీయమని మాజీమంత్రి పీతల సుజాత విమర్శించారు. పార్లమెంట్లో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావుకి నివాళులు అర్పించకుండా బయటకొచ్చిన వైకాపా ఎంపీలు గొప్ప నాయకులని ఎద్దేవా చేశారు. ఎస్సీలను ఎంతకాలం ఇలా అవమానిస్తారని నిలదీసిన ఆమె..., ఒక దళిత ఎంపీకి ముఖ్యమంత్రి, వైకాపా ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'పాలకులు మారినప్పుడల్లా... సంప్రదాయాలు మారవు'