జయప్రకాశ్ నారాయణ్ను ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు చేసినప్పుడు... వినాశకాలే విపరీత బుద్ధి అని అన్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సామెత రాష్ట్ర ప్రభుత్వానికి వర్తిస్తుందేమో అని అన్నారు. తప్పుడు కేసులు పెట్టడం, పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పటం... జైళ్లకు పంపించటం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఒక అరాచక ఆటవిక విధానాలకు ఈ ప్రభుత్వం నాంది పలికిందని ధ్వజమెత్తారు. తమ వైఫల్యాను కప్పిపుచ్చేందుకు... ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
అభివృద్ధి శూన్యం... అరాచక విధానాలు ఎక్కడా చూసినా అవినీతి అక్రమాలుకు ఈ ప్రభుత్వం కేంద్ర బిందువుగా మారిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియా ఉందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. సిమెంట్ వంద రూపాయలకు పెంచి, అందులో 30 రూపాయలు కమిషన్ ఏంటని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో ప్రబలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పెరగటానికి ప్రభుత్వ పనితీరే కారణన్నారు.
కేవలం రెండు రోజులే అసెంబ్లీను నిర్వహించటం తగదన్నారు. సమస్యలపై చర్చించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ వారికి సరైన న్యాయ జరగటం లేదన్నారు. భూ సేకరణ పేరుతో అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే 144 సెక్షన్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పోలీసు రాజ్యం... కక్షసాధింపే లక్ష్యం : ఎంపీ గల్లా జయదేవ్