వైకాపా నేతలకు దోచిపెట్టడానికే.. తితిదే ఆస్తుల అమ్మకానికి పెట్టారని తెదేపా నేత బొండా ఉమామహేశ్వర రావు విమర్శించారు. పాలక మండలి తీసుకోవాల్సిన నిర్ణయాలలో ప్రభుత్వ జోక్యం ఏంటని దుయ్యబట్టారు. తితిదేకు చెందిన ఆస్తులను వేలం వేయడానికి మీకేం హక్కుందని మండిపడ్డారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి బంగారం, వజ్రాలను స్వామి వారికి ఇచ్చారని... భక్తులు స్వామి వారి కోసం మనస్పూర్తిగా కానుకలు, ఆస్తులు సమర్పిస్తుంటారని... ఆ ఆస్తులను ఇలా అమ్ముకుంటూపొతే ఎవరైనా కానుకలు ఇస్తారా అని ప్రశ్నించారు.
ఇప్పటికే కొండపైన అన్యమత ప్రచారాలను ప్రోత్సాహిస్తున్నారని తాడేపల్లి కోట నుంచి నిర్ణయాలు చేస్తే... తితిదే బోర్డు అమలు చేస్తుందని మండిపడ్డారు. తితిదే ఆస్తుల పరిరక్షణకై తెదేపా పోరాటం చేస్తుందన్నారు. మొండిగా అమ్మకాలు సాగిస్తే... మళ్లీ వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: