ETV Bharat / state

'ప్రజలకు చెట్టు కింద వైద్యం- వైకాపా నేతలకు కార్పొరేట్​ వైద్యం'

అనంతపురం ఘటనపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ప్రజలకి చెట్టు కింద వైద్యం అందిస్తున్న వైకాపా ప్రభుత్వం.. ఆ పార్టీ నాయకులు మాత్రం పక్క రాష్ట్రంలో చికిత్సలు చేయించుకుంటున్నారని మండిపడ్డారు.

tdp leader ayyana patrudu tweet on anantapur  incident
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై విమర్శలు
author img

By

Published : Jul 24, 2020, 4:33 PM IST

tdp leader ayyana patrudu tweet on anantapur  incident
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై విమర్శలు

అనంతపురం ఘటనపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ప్రజలకు చెట్టు కింద వైద్యం అందిస్తున్న వైకాపా ప్రభుత్వం.., ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ విజయసాయి రెడ్డి వాళ్లు మాత్రం హైదరాబాద్​లో కార్పొరేట్ వైద్యం కోసం వెళ్తున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులు ఆంధ్రప్రదేశ్​లో వైద్యం ఎందుకు చేయించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

టెస్టుల్లో టాప్, వైద్యంలో నెంబర్ 1 అంటూ డప్పుకొట్టుకుంటున్న వారు... కరోనా పాజిటివ్ రాగానే ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకోవడానికి ఎందుకు పారిపోతున్నారని నిలదీశారు. ఈ వివక్ష ఎందుకని సీఎం జగన్​ను ప్రశ్నించారు.

ఆంబులెన్స్ రాక ...రోగులను ఆటోల్లో తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. సరైన వైద్యం అందక ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు వదులుతున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస గౌరవం లేకుండా మృతదేహాలను జెసీబీలతో విసిరేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి మంచిది కాదని హితవు పలికారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అయ్యన్న ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇదీ చూడండి. లక్ష విలువైన 'నాడు - నేడు' పనులకు లక్షా 70 వేలు వసూలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.