కరోనా నిర్మూలన విషయంలో ముఖ్యమంత్రి బేషజాలకు పోకుండా... మేధావుల సలహా తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సూచించారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు కేరళని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని అన్నారు. కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యావసర వస్తువులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి అందరూ కలిసి పోరాడదామని అన్నారు.
ఇవీ చదవండి: వలస కూలీల ఆకలి తీర్చిన 'ఈటీవీ భారత్'