'నవమాసాల పాలనలో చేసింది నవమోసాలు ' - deveni uma ex mla latest updates
మాజీ మంత్రి దేవినేని ఉమా కృష్ణా జిల్లా ప్రజాచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఈ తొమ్మది నెలల వైకాపా పాలనను నవమోసాలుగా వర్ణించారు. ఇసుక మాఫియా విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒక మాట చెపుతూ ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.