ఎంపీ విజయసాయిరెడ్డి మానసికంగా ఇబ్బంది పడుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అందుకే పోతిరెడ్డిపాడుపై చంద్రబాబు స్పందించారా అని ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్ర సీఎం తండ్రి లాంటి వారు, సమస్యలన్నీ తొలగిపోయాయన్న ముఖ్యమంత్రి జగన్... ప్రాజెక్టులు కలిసి కట్టుకుంటాం, నీళ్లు పంచుకుంటాం అంటూ కేసీఆర్‌కి లొంగిపోయారని విమర్శించారు. ఆ అనుబంధం ఏమైందని ప్రశ్నించారు. నీళ్లు తేకుండా కొత్త డ్రామా ఏంటో సమాధానం చెప్పాలన్నారు. ఏడాదిగా ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు కదలకుండా చేసి కథలు చెప్తున్నారని మండిపడ్డారు.
నాన్నని చంపింది రిలయన్స్ అని రెచ్చగొట్టి... అమాయక దళిత బిడ్డలను జైలుకు పంపిన ముఖ్యమంత్రి జగన్.. అదే రిలయన్స్ వారికి రాజ్యసభ్య సీటు ఇచ్చి దళితులను దగా చేశారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సీఎం అయ్యాక అధికార ఉందికదా అని దళితులపై వరుస దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న దళిత వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టినందుకు మాజీఎంపీ హర్షకుమార్‌ని, మహాసేన రాజేష్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మాస్క్ అడిగినందుకు ఒక దళిత వైద్యుడిని వేధించి చంపేస్తామని బెదిరించారని ఆక్షేపించారు. ఆఖరికి ఒక డాక్టర్‌పై పిచ్చివాడు అని ముద్ర వేసి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి