ETV Bharat / state

''ఈ ఏడాది చక్రం తిప్పేది చంద్రుడే.. శోభకృత్ సంవత్సరంలో అన్నీ శుభాలే..''

author img

By

Published : Mar 22, 2023, 4:00 PM IST

Updated : Mar 22, 2023, 4:44 PM IST

Ugadi celebrations at NTR Bhavan : శోభకృత్ నామ సంవత్సరంలో తెలుగు ప్రజలకు శుభం కలుగుతుందని, అధికార పార్టీ అరాచకాలు, అక్రమాలు ఇక సాగవని పంచాంగం చెప్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది చంద్రుడు ఇంద్రుడు అయి చక్రం తిప్పునున్నారని, సైకిల్ దూసుకుపోతుందని బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు

Ugadi celebrations at NTR Bhavan : అధికార పార్టీ ఆశలు సాగవని పంచాంగంలో కూడా చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. నాలుగేళ్లు ఈ రాష్ట్రంలో కష్టాలే ఉన్నాయన్న అయన.. శోభకృత్ నామ సంవత్సరంలో శుభాలే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు వెలుగు రావడం ఖాయమని చెప్పారు. తెలుగు వారు ముందే పంచాంగం చెప్పారని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్లేశారని, అరాచకానికి ఓ పద్ధతి, ఓ విధానం ఉంటుందన్న చంద్రబాబు.. గత 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశానని మండిపడ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రశ్నిస్తే దాడులేనా... ప్రశ్నించిన పేదలపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ ఉండాలని తెలిపారు. ధరలు పెరిగాయి.. పన్నులు పెరిగాయి.. ప్రజలపై భారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పంచాంగం ఓ డెరెక్షన్ ఇస్తుంది.. సూచన ప్రాయంగా సంకేతాలిస్తుందన్నారు. పంచాంగం ఎంతో శాస్త్రోక్తంగా రాస్తున్నారు. అస్ట్రాలజీ కూడా సైన్సే అని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్త పడడానికి పంచాంగం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలుగు జాతి అనేక రంగాల్లో రాణిస్తోందన్న అయన.. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారి ప్రతిష్ట పెరిగిందన్నారు. ఉగాదికి టీడీపీకి దగ్గర సంబంధం ఉందని తెలిపారు. తెలుగు వారి కోసమే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని వెల్లడించారు. ఈసారి ఉగాది, రంజాన్ ఒకే సమయంలో రావటం శుభపరిణామం అని చంద్రబాబు పేర్కొన్నారు.

నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కష్టాలు, సమస్యలే ఉన్నాయి. దుఖాలు తప్ప మరోటి లేవు. కనీసం శోభకృత్ నామ సంవత్సరంలో అయినా శుభం జరుగుతుందని ఆశ. తప్పకుండా ఈ సంవత్సరం తెలుగు వారికి వెలుగులు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. జరుగుతుందని కూడా ఆశాభావం ఉంది. ఈ విషయాన్ని నేను ముందుగానే చెప్పాను. ప్రజలు కూడా తిరగబడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఇచ్చింది మామూలు తీర్పు కాదు. మూడు ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం ఎంత భయపెట్టినా, సమస్యలు సృష్టించినా మేం భయపడం, తిరుగుబాటుకు నాంది పలుకుతామని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అరాచకాలకు, అణగదొక్కేందుకు ఓ పద్ధతి ఉంటుంది. ఎనరైనా సమస్య ఉన్నదని చెప్తే వారిపై దాడులకు పాల్పడడం చూశాం. అధికారంలో ఎవ్వరూ శాశ్వతం కాదు. సమస్యలు పరిష్కరించమని అధికారం ఇస్తే ఆటలు ఆడుతున్నారు. ఇకపై మీ ఆటలు సాగవని ఈ పంచాంగం చాలా స్పష్టంగా చెప్పింది. - చంద్రబాబు, తెలుగుదేశం అధినేత

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది చంద్రుడు ఇంద్రుడు అయి చక్రం తిప్పునున్నారని, సైకిల్ ఈ ఏడాది దూసుకుపోతుందని తెలిపారు. ప్రజలు అనేక విషయాల్లో మొండిగా వ్యవహరిస్తారన్నారు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు.

పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభం.. దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుందని, నేరగాళ్లు, రుణ ఎగవేత దారులు పెరిగిపోతారని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు ఇబ్బందులు గురిచేస్తాయని, ఏడు తుపాన్ల ప్రమాదం పొంచి ఉందని, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భూ కంపాలు వచ్చే సూచనలున్నాయని వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షానికి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. మిత్రపక్షాలన్నీ ఏకమమవుతాయన్నారు. అధికార పక్షం కేసులు పెట్టినా... ప్రధాన ప్రతిపక్షం వాటిని ధీటుగా ఎదుర్కొని ముందుకు వెళుతుందని వివరించారు. జాతీయ రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారు మరింత బలపడతారని చెప్పారు. అన్ని పార్టీలు తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారని.. పార్టీ ఫిరాయింపులు ఆశ్చర్యం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.

విద్య, వైద్య రంగాల్లో కుంభకోణాలు.. ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని.., పరిపాలనలో న్యాయ పరమైన చిక్కులు ఎదురవుతాయన్నారు. ధరలు పెరుగుతాయని, వాటిపై ప్రధాన ప్రతిపక్షం పోరాటాలు చేస్తాయని తెలిపారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతాయన్నారు. ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో స్కాములు బయటపడతాయని, అభివృద్ధి కంటే అనారోగ్యకరమైన పోటీ ఎక్కువగా ఉందన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరుగుతుందని తెలిపారు.

లోకేశ్ కు గుర్తింపు.. ఈ ఏడాది నారా లోకేశ్ కు శ్రమ అధికంగా ఉంటుందని తెలిపారు. ప్రజల్లో నారా లోకేశ్ కు మంచి గుర్తింపు లభిస్తుందని వెల్లడించారు. నారా లోకేశ్ కొన్ని విఘ్నాలు ఎదురవుతాయన్న అయన... వాటిని మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్తారని స్పష్టం చేశారు. కొత్త కార్యక్రమాలు చేస్తూ లోకేశ్ దిగ్విజయంగా ముందుకు సాగుతారని ఆకాంక్షించారు. ఈ ఏడాది టీడీపీలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Mar 22, 2023, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.