విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ సీనియర్ నాయకుడు నాగుల్ మీరా.. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. తెదేపా కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని... ఎక్కడకు వెళ్లినా వైకాపా నేతల అవినీతే కనిపిస్తోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. తమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి బెదింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల కన్నా కోట్లు కూడేసుకోటమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
తెదేపా అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. పార్టీలో వివాదం ఏమీ లేదని స్పష్టం చేశారు. అభ్యర్థి మార్పు ప్రచారంతో నిన్న కొంత గందరగోళం నెలకొన్నది వాస్తవమేననీ.. మేయర్ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించిన వారికే సహకరిస్తామని స్పష్టంచేశారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారని నాగుల్‌మీరా అన్నారు. పెన్షన్, రేషన్ వంటి పథకాలను కట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.
తెదేపా అభ్యర్థులకు.. ప్రజల ఆదరణ లభిస్తోందని చెప్పారు. మంత్రి వెల్లంపల్లి అధికారులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఓట్లను నోట్లతో కొని.. గెలవాలని మంత్రి తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు. తెదేపా, సీపీఐ కలిపి.. పశ్చిన నియోజకవర్గంలో 22 సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో వైకాపా అరాచకాలకు చెక్ పెట్టాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: