ETV Bharat / state

అన్న క్యాంటీన్ తెరవాలని తమ్ముళ్ల ఆందోళన - anna canteen

మూసివేసిన అన్నా క్యాంటీన్లను వెంటనే తెరిపించాలని కోరుతూ విజయవాడలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన నిర్వహించారు.

అన్నాక్యాంటీన్
author img

By

Published : Aug 3, 2019, 11:53 AM IST

అన్న క్యాంటీన్ తెరవాలని తమ్ముళ్ల ఆందోళన

మూసివేసిన అన్న క్యాంటీన్​ను వెంటనే తెరవాలని కోరుతూ విజయవాడ మధ్యమ నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు ఆకలి తీర్చి ఎంతో ఉపయుక్తంగా ఉన్న అన్న క్యాంటీన్లు మూసివేయడం వల్ల పేద బలహీన వర్గాల్లో తీవ్ర నిరాశ నెలకొందని వెంటనే తెరిపించాలని కోరారు.

అన్నా క్యాంటీన్లను తక్షణం తెరిపించాలంటూ విజయవాడలో తూర్పు నియోజకవర్గం తెదేపాఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ సాక్షిగా అన్నక్యాంటీన్లను మూసివేయమని చెప్పి, వైకాపా ప్రభుత్వం వాటిని మూసివేయడాన్ని తెదేపా తప్పుపట్టింది. మడమ తిప్పం... మాట తప్పం అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు విమర్శించారు. పేదవానికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పేరు మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని, పేదవాని నోటిముందు కూడు తీయవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​కు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి.

బ్రిటానియా బిస్కెట్‌ పరిశ్రమ గోదాంలో అగ్నిప్రమాదం

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_49_02_Balija_Sangham_Nayakula_Ryally_AVB_AP10004

Body:కాపులకు 5 శాతం రిజర్వేషన్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో బలిజ సంఘం నాయకులు నల్ల జెండాలతో ర్యాలీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ లు ఇస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. తీర్మానానికి మద్దతు తెలిపిన వైకాపా అధికారంలోకి రాగానే రిజర్వేషన్లను రద్దు చేయడం కక్షపూరిత జరిగాయని నాయకులు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని అని హెచ్చరించారు

Conclusion:బైట్
భైరవప్రసాద్, బలిజ సంఘం నాయకుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.